BHPL: గణపురం మండలం చెల్పూర్ లోని KTPPలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ (బొగ్గు చూర) ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. కిలోమీటర్ల మేర పొగ మంచు కొమ్ముకుంది. ఎండ తీవ్రతతో బొగ్గు నిల్వలో మంట పుట్టినట్లు తెలుస్తోంది.