W.G: అగ్ని ప్రమాదాల నివారణపై ముఖ్యంగా మహిళలు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఫైర్ ఆఫీసర్ ఐ. అజయ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ తణుకు పట్టణ పరిధిలోని పలు అపార్ట్మెంట్ల ఆవరణలో మహిళలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు జరిగినప్పుడు నివారణకు తీసుకోవలసిన అత్యవసర చర్యలపై వారికి అవగాహన కల్పించారు.