TG: గవర్నర్ శివప్రతాప్ శుక్లా భద్రాచలం చేరుకున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. హెలిప్యాడ్ వద్ద గవర్నర్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేశారు.