AP: విజయవాడ-దువ్వాడ సెక్షన్లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ కారణంగా ఈనెల 28 నుంచి మే 5వ తేదీ వరకు 20 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 10 రైళ్లను దారి మళ్లించడంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. SEC-VJD- (శాతవాహన), GTR-SEC, VJD- భద్రాచలం (మెమో)తో పాటు మరిన్ని రైళ్లు రద్దయ్యాయి.