AP: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మాజీమంత్రి రోజా స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా మహిళా సాధికారితను ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని ఆమె కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత సైతం జగన్‌కే దక్కుతుందని తెలిపారు.