AP: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి పొట్టి శ్రీరాములు ప్రతీక అని తెలిపారు. ‘ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.