ADB: వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఒక కాటన్ పరిశ్రమలో అగ్ని నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాద సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే పద్ధతులను ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారి నర్సింహారెడ్డి, లక్ష్మీ కుమారి పాల్గొన్నారు.