KMM: వేంసూరు మండలంలోని రాజుగూడెంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆవును 1962 పశు సంచార వైద్య బృందం కాపాడింది. రైతు కొప్పుల బాబురావు ఆవుకు గతంలో చేసిన కొమ్ము శస్త్రచికిత్స వికటించడంతో పరిస్థితి విషమించింది. సమాచారం అందుకున్న డాక్టర్ జెస్సీ వెంటనే అక్కడికి చేరుకుని, కుళ్ళిపోయిన కొమ్మును శస్త్రచికిత్స ద్వారా తొలగించి గోవు ప్రాణం కాపాడారు.