ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంఛార్జ్ ప్రాజెక్టు అధికారి ఏం.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.