BPT: కొరిశపాడు మండలంలో సోమవారం పదో తరగతి పరీక్షలకు 440 మందికి గాను 436 మంది పరీక్ష రాసినట్లు మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య చెప్పారు. నలుగురు విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు త్రాగునీరు వంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు పున్నయ్య పేర్కొన్నారు.