TPT: సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 30–40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. శరీరంపై ఎటువంటి బట్టలు లేకుండా పచ్చ రంగు కట్ డ్రాయర్ మాత్రమే ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వారు సూళ్లూరుపేట సీఐ, ఎస్సైను సంప్రదించాలని పోలీసులు కోరారు.