AP: ఏలూరు జిల్లా ఆకివీడు ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రామ భక్తులు సంయమనం పాటించాలని కోరారు. న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. 1932లోనే ప్రభుత్వం అసైన్డ్ భూమి అని గుర్తించిందని తెలిపారు. అక్కడ రామాలయం ఉందని రెవెన్యూ అధికారులు ధృవీకరించారని వెల్లడించారు.