»Ex Minister On Bullock Cart Netizens Fire On Senior Leader Of Aiadmk
Video Viral: ఒంటెద్దు బండిపై మాజీ మంత్రి.. అన్నాడీఎంకే సీనియర్ నేతపై నెటిజన్లు ఫైర్
సీఎం స్టాలిన్ సర్కార్‌పై అన్నాడీఎంకే సీనియర్ నేత వినూత్నంగా ఒంటెద్దు బండిపై ప్రయాణించి నిరసన తెలిపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగ జీవాలను ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఓ మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత.. ఒంటెద్దు బండిపై చక్కర్లు కొట్టారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ఈ రకంగా నిరసన తెలుపడంతో పలువురు పెదవి విరుస్తున్నారు. తమిళనాడు మాజీ మంత్రి జయకుమార్ చెన్నై నగరంలో ఒంటెద్దు బండిపై ప్రయాణం చేసిన ఘటన చోటుచేసుకుంది. అధికారంలోకి రాకముందు ఇంధన ధరలపై సబ్సిడీ ఇస్తామని డీఎంకే ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని డీఎంకే ప్రభుత్వం తుంగలో తొక్కిందని నిరసన తెలుపుతూ ఒంటెద్దు బండిపై వినూత్నంగా ప్రయాణించి ఆయన నిరసన తెలిపారు.
వైరల్ అవుతోన్న వీడియో:
#WATCH | Chennai: AIADMK Senior leader and former Tamil Nadu Minister D Jayakumar rode a bullock cart in Vannarapettai, to condemn the DMK government's delay in fulfilling poll promise to give fuel subsidy. (05.11)
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని వన్నారపేటలో ఒంటెద్దు బండిపై జయకుమార్ ప్రయాణించారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. జయకుమార్ అలా ఒంటెద్దు బండిపై ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన బండిపై వెళ్తుండగా కొంతమంది ఆయన్ని అనుసరించారు. మరికొందరు వింతగా చూస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు.
వైరల్ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేశారు. నిరసన తెలియజేయడానికి అమాకపు జంతువుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటూ ఫైర్ అవుతున్నారు. అలాంటి డ్రామాను ఆపాలని మరికొందరు కామెంట్ చేశారు. మాజీ మంత్రి ఇలా చేయడం బాలేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఘటనపై డీఎంకే నేతలు ఎవ్వరూ ఇంత వరకూ స్పందించలేదు.