LSGతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో RCB విజయం సాధించడంపై ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. ‘ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా. సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు’ అని తెలిపాడు.