SRCL: అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని కలెక్టర్ చౌరస్తా వద్ద గురువారం సీట్ బెల్ట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీటు బెల్టు వేసుకొని వాహనం నడపాలన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాక వాహనదారులు మృతి చెందే ప్రమాదం ఉందన్నారు.