KNR: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసినట్లు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఒడితల ప్రణవ్ తెలిపారు. నిరుపేద రోగులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.