ASF: గిరిజన హాస్టల్ వర్కర్లకు 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ గిరిజన బాలుర పాఠశాల వర్కర్లతో కలిసి గురువారం సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. వేసవి సెలవులు దగ్గర కావస్తున్నప్పటికీ వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతనాలు చెల్లించకుంటే ఆందోళన తప్పదన్నారు.