NRML: మామడ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, స్వామివారి 13 గ్రాముల బంగారం, ఐదు కిలోల వెండి ఆభరణాలను చోరీ చేశారు. గురువారం ఉదయం పూజారులు గమనించి ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు.