మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉన్నా, దగ్గరకు వెళ్తే తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని, ప్రస్తుతం వీధిలైట్లు తప్ప పనులు లేవని ఆరోపణలు ఉన్నాయి. చెరువులో గుర్రపు డెక్కలు తొలగించకపోవడంతో దుర్వాసన పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.