TG: ప్రభుత్వం ఇప్పటికైనా RTC సమ్మెపై జోక్యం చేసుకోవాలని ఆర్టీసీ JAC ఛైర్మన్ అన్నారు. కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని, RTCని మాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వెనుక ఆర్టీసీ కార్మికులు తప్ప మరెవరూ లేరని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.