AP: రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ విధానంలో చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32 శాతంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదైందని వెల్లడించారు.