KMR: బిక్కనూరు మండలంలో ఎంపీటీసీ ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత నమోదైన కొత్త ఓటర్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించామని వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా ఓటర్లను సంబంధిత ఎంపీటీసీ స్థానాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసమే ఈ మ్యాపింగ్ చేపడుతున్నట్లు ఆయన వివరించారు.