చెక్‌బౌన్స్ కేసుపై బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ స్పందించాడు. తాను జైలుకెళ్లడానికి డబ్బు చెల్లించకపోవడం మాత్రమే కారణం కాదని అన్నాడు. ఇది కేవలం రూ.5 కోట్ల వివాదం కాదని, దీనివల్ల తాను రూ.17 కోట్లు నష్టపోయానని తెలిపాడు. తనపై వచ్చిన మోసం ఆరోపణలను ఆయన ఖండించాడు. సినిమా ఫలితాలను బట్టి మోసగాడిగా ముద్ర వేయకూడదని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు.