BDK: పారిశుద్ధ్యం, క్లీనింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పినపాక ఎంపీడీవో వెంకటేశ్వరరావు మంగళవారం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణం మొత్తం పర్యవేక్షణ చేస్తూ మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని తెలిపారు.