WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ భద్రయ్య ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. గ్యాస్ సిలిండర్లు, పైపులను తరచూ తనిఖీ చేయాలని, వంటగదిలో సరైన గాలి ప్రసరణ ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో ఆస్తి, ప్రాణ నష్టం నివారించవచ్చని అధికారులు తెలిపారు.