TG: జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆరు నెలల్లోపు PRC అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పటికీ ఆ మాట ఎత్తడం లేదని విమర్శించారు. CPS రద్దు చేస్తామన్న హామీని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.