BDK: రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా చర్ల సీహెచ్సీలో శుక్రవారం అన్ని వర్గాల డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ హారిక తెలిపారు. ఈ శిబిరంలో ఆటో, బస్సు, కారు, లారీ, ట్రాక్టర్ డ్రైవర్లకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.