ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ వెళ్లిన తనను అక్కడి CISF పోలీస్ అధికారి కనీసం కూడా గుర్తుపట్టలేదు. ఆ క్రమంలో విమానాశ్రయంలోకి వెళ్లేందుకు బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు చూపించేవరకు అధికారి పంపించలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
The cisf officer refuse heroine disha patani at mumbai airport
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి దిశా పటానీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా దిశా పటానీ(disha patani) వస్తుందంటే చాలు అనేక మంది ఫోటోలు దిగేందుకు ఫోజులిస్తారు. అనేక చిత్రాల్లో యాక్ట్ చేయడంతో ఈ భామను దాదాపు చాలా మంది గుర్తుపడతారు. కానీ తాజాగా ఈ అమ్మడు ముంబయి ఎయిర్ పోర్టుకు వెళ్లగా..అక్కడి సీఐఎస్ఎఫ్ సెక్యురిటీ అధికారి ఆమెను ఆపాడు. అంతేకాదు ఆమె ఎవరో తెలియనట్లుగా ప్రవర్తించాడు. ఆ క్రమంలో తన బోర్డింగ్ పాస్ చూపించాలని ఆడుగగా దిశా చూపించింది.
ఆ క్రమంలో తన గుర్తింపు కార్డును కూడా చూపించాలని అడగడంతో దిశా చేసేదేమి లేక బ్యాగులో ఉన్న తన గుర్తింపు కార్డును అతనికి చూపించి లోపలికి వెళ్లింది. చివరకి ఆమె తన కార్డును చూపించిన తర్వాతే ఆమెను విమానాశ్రయంలోకి అనుమతించారు. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది కాస్తా ప్రస్తుతం వైరల్ మారింది. ఆ వీడియో చూసిన పలువురు ఆ అధికారికి దిశా పటానీ కూడా తెలియదా అంటూ కామెంట్లు(comments) చేస్తున్నారు. మరికొంత మంది అయితే మీ విధులను చాలా బాగా నిర్వర్తించారని కానిస్టేబుల్ పనితనాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక దిశా పటానీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ADలో యాక్ట్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.