కర్ణాటకలో మంగ్లీ కారుపై దాడి జరిగిందని.. కన్నడ భాష మాట్లాడకపోవడంతో కొందరు దాడికి పాల్పడ్డారనే వార్తలు ఆదివారం గుప్పుమన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. మంగ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారుపై రాళ్ల దాడి చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ తప్పుడు కథనాలని మంగ్లీ కొట్టి పారేసింది. అదంతా తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు సోమవారం మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బళ్లారిలో జరిగిన కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. ఆ ఈవెంట్ ఎంత గొప్పగా జరిగిందో ఆ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తుంది. నేను పాల్గొన్న ఈవెంట్లలో బెస్ట్ ఈవెంట్ ఇది. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, ప్రోత్సాహానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే అక్కడి అధికారులు, నిర్వాహకులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది మాటల్లో చెప్పలేనిది. ఇదంతా నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నా. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా’ అని మంగ్లీ పోస్టు చేసింది.
అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు బళ్లారిలో ఏం జరిగిందనేది మాత్రం మంగ్లీ వివరించలేకపోయింది. కన్నడలో మాట్లాడని యాంకర్ అనుశ్రీ మంగ్లీని కకోరిందని సమాచారం. అయితే ఇక్కడ ఎక్కువ మంది తెలుగువారే ఉండడంతో తెలుగులో మాట్లాడతానని మంగ్లీ తెలిపింది. దీనిపైనే వివాదం మొదలైందని తెలుస్తోంది. కన్నడ భాష మాట్లాడలేదనే కన్నడ భాషాభిమానులు దాడి చేశారని సమాచారం. అయితే దీనిపై స్పష్టత లేదు.
I completely deny Fake news on some social media groups about me… Please don’t spread wrong news pic.twitter.com/oy71WFEzFw