తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ముల రూటే సపరేటు. కాస్త గ్యాప్ ఇచ్చి సినిమాలు చేసినా.. మంచి సినిమాలు అందిచడం కమ్ముల స్టైల్. ‘ఫిదా’ తర్వాత లాంగ్ గ్యాప్‌తో చేసిన ‘లవ్ స్టోరీ’ మూవీ కూడా.. శేఖర్‌కు మంచి హిట్ అందించింది. అయితే ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. దాంతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. హీరో ఎవరనే విషయాల్లో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతునే ఉంది. అయితే ముందు నుంచి వినిపించినట్టుగా.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తోనే శేఖర్ కమ్ముల నెక్ట్స్ సినిమా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు స్క్రిప్టు పై కసరత్తులు చేసిన కమ్ముల.. ఫైనల్‌గా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అన్ని అనుకున్నట్టు జరిగితే.. వచ్చే ఏడాది అరంభంలో.. అంటే జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారని టాక్. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళ్‌తో పాటు ఓ తెలుగు స్ట్రెయిట్ మూవీ కూడా చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. దాంతో శేఖర్ కమ్ముల సినిమా స్టార్ట్ చేయనున్నారని చెప్పొచ్చు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడుంటుందో చూడాలి.