WG: మీ భూమి-మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు MLA పితాని సత్యనారాయణ తెలిపారు. సోమవారం పెనుగొండ మండలం రామన్నపాలెంలో ఆయన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిచేసి కొత్త పుస్తకాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బడేటి బ్రహ్మాజీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.