ఇప్పటి వరకు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరు కూడా.. కథానాయిక పాత్ర బలంగా ఉండే సినిమాలే చేస్తు వచ్చారు. అయితే ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారు. కీర్తి సురేష్ అయినా కొన్ని సినిమాల్లో నటిస్తోంది.. కానీ సాయి పల్లవి మాత్రం దూరంగా ఉంటోంది. గతేడాది నానితో ‘శ్యామ్ సింగరాయ్’.. నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో విజయాలు అందుకుంది సాయి పల్లవి. ఇక ఈ ఏడాది రానాతో ‘విరాట పర్వం’.. సోలోగా ‘గార్గీ’ అనే సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం కొత్త సినిమాలు కమిట్ అవడం లేదు. శివ కార్తీకేయన్తో కలిసి ఓ సినిమాలో మాత్రమే నటిస్తోంది. దాంతో ఇక పై సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అమ్మడు జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన సంగతి తెలిసిందే. అందుకే తన స్వస్థలమైన కోయంబత్తూర్లో సొంతంగా హాస్పిటల్ పెట్టుకోనే ఆలోచనలో ఉందట. ఇక కీర్తి సురేష్ కూడా సినిమాలకు దూరమవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్, నాని దసరా సినిమాలతో పాటు తమిళ్లోను సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని వార్తలొస్తున్నాయి. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోడానికి కీర్తి ఓకే చెప్పినట్టు టాక్. ఆ అబ్బాయి కీర్తికి కూడా నచ్చడంతో పెళ్లికి పచ్చ జెండా ఊపేసిందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు అన్నీ మాట్లాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే పెళ్లి తర్వాత కీర్తి నటనకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా కొనసాగుతుందని టాక్. ఇలా ఈ ముద్దుగుమ్మలు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వస్తుండడంతో.. ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.