ఇండస్ట్రీలో ఓ హీరో నుంచి మరో హీరోకి కథలు మారడం కామన్. ఇప్పుడు కూడా యంగ్ టైగర్‌తో చేయాలనుకున్న కథ.. రామ్ చరణ్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప్పెన సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినా ఇప్పటి వరకు మరో సినిమా మొదలు పెట్టలేదు దర్శకుడు సానా బుచ్చిబాబు.
గత కొంత కాలంగా ఎన్టీఆర్‌తో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు బుచ్చి బాబు. అయితే ఇప్పుడా ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 కమిట్ అయ్యాడు. దాంతో ఇప్పట్లో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
అందుకే బుచ్చి బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్‌తో చేయాలనుకున్న కథనే చరణ్‌తో చేస్తున్నాడా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కథనే చరణ్ చేస్తున్నాడని అంటుండగా.. కొందరు మాత్రం బుచ్చి బాబు సరికొత్త కథతో చరణ్‌ను ఇంప్రెస్ చేశాడని అంటున్నారు.
ఆ కథకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్. అయితే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బుదులుగా ఓ కొత్త ప్రొడ్యూసర్ నిర్మించబోతున్నట్టు సమాచారం. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతోందని అంటున్నారు. ప్రస్తుతం చరణ్.. శంకర్‌తో కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా ఉంటుందంటున్నారు. మరి చరణ్-బుచ్చిబాబు కాంబో నిజంగానే వర్కౌట్ అవుతుందేమో చూడాలి.