BDK: ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉండే నాయకుడికి ప్రమాదం జరగడం బాధాకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీపీఐ జూలూరుపాడు మండల కార్య దర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లును ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.