కృష్ణా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులను ముందుగానే 10వ తరగతి పరీక్షలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని 10th సిలబస్‌పై దృష్టి పెట్టాలని, స్లిప్ టెస్టులు పెట్టాలన్నారు.