Malli Pelli Movie: ‘మళ్లీ పెళ్లి’ కలెక్షన్స్ దారుణాతి దారుణం!
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మళ్ళీ పెళ్ళి, మేమ్ ఫేమస్, మెన్ టూతో పాటు మలయాళ సంచలన చిత్రం 2018 కూడా ఉంది. ఇవన్నీ చిన్న సినిమాలే. ఒక్క పెద్ద సినిమా కూడా బక్సాఫీస్ బరిలో లేకపోవడంతో.. చిన్న సినిమాల జాతర థియేటర్లో గట్టిగానే ఉంది. దాంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'మళ్లీ పెళ్లి' పరిస్థితేంటి?
చాలా రోజులుగా సీనియర్ లవ్ బర్డ్స్ పవిత్ర లోకేష్, నరేష్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఈ ఇద్దరు కాస్త ఏజ్ అయ్యాక కలిశారు కానీ.. యంగ్ ఏజ్‌లో కలిసి ఉంటే.. ఆ దారుణాలు ఇంకెలా ఉండేవో ఊహించుకోవచ్చు. అలా బోల్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు ఈ ఇద్దరు. అంతేకాదు ‘మళ్లీ పెళ్లి’ సినిమా చేసి నానా రచ్చ చేశారు. దాంతో ఎంత రాబట్టింది? అనేది మరింత ఎగ్జైటింగ్‌గా మారింది. ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు చేశాడు నరేష్. ప్రమోషన్స్‌గా కూడా గట్టిగానే చేశారు. బోల్డ్ ఇంటర్వ్వూతో రచ్చ చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు రోజు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి రావడంతో.. మంచి బజ్ వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టలేకపోయిందని అంటున్నారు.
ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా కేవలం 40లక్షల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను తీశాడు నరేష్. కానీ ఈ రియల్ జోడీని రీల్ పై చూసేందుకు జనరల్ ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే.. ఇక మిగతా రోజుల్లో మళ్లీ పెళ్లి పరిస్థితి ఏంటనేది? అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా భారీ నష్టాలనుమిగిలిస్తుందని అంటున్నారు. అయితే ఈ వారం థియేటర్లోకి వచ్చిన సినిమాల్లో.. ‘మేమ్ ఫేమస్’ వరల్డ్ వైడ్‌గా కోటీ పదిలక్షల గ్రాస్ వసూలు చేసింది. అలాగే మలయాళ బ్లాక్ బస్టర్ 2018 మూవీ కూడా కోటి రూపాయలు వసూలు చేసింది. కానీ మళ్లీ పెళ్లి సినిమా వసూళ్లే దారుణాతి దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు.