NTR: జాతీయ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండలం మల్లెల గ్రామంలో సోమవారం 205 గేదెలు, 51 ఆవులకు టీకాలు వేశారు. ఈ వ్యాధి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో గాలికుంటు రాకుండా వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని డాక్టర్ అభిలాష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పశువుల యజమానులు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.