అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని AP ప్రభుత్వం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. ‘చేతిలో తుపాకీ లేదు, సైన్యం లేదు, అధికారమూ లేదు. కేవలం అచంచల సంకల్పం. 58 అడుగుల విగ్రహం కేవలం ఒక కొలత కాదు. 58 రోజుల సంకల్పానికి నిలిచిన సజీవ రూపం. కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు. ఒక మనిషి ఉపవాస దీక్ష కూడా’ అని అన్నాడు.