ఏ ముహుర్తాన మహేష్ బాబు-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రకటించారో గానీ.. అప్పటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో నెల రోజుల పాటు.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందని వినిపించింది.
కానీ నాలుగైదు రోజుల్లోనే ఈ షెడ్యూల్‌ను చుట్టేశారు. దానికి కారణం మహేష్‌కు స్క్రిప్టు నచ్చలేదని వినిపించింది. దాంతో త్రివిక్రమ్ మళ్లీ కథ పై కసరత్తులు చేయాల్సి వచ్చిందనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ లోపే తన తల్లి ఇందిరాదేవిని కోల్పోయారు మహేష్. ఇక సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకున్న సమయంలో..
సూపర్ స్టార్ కృష్ణ మరణం మహేష్‌ను కలిచి వేసింది. దాంతో ఎస్ఎస్ఎంబీ 28కు బిగ్ బ్రేక్ తప్పలేదు. త్రివిక్రమ్ కూడా కొన్నాళ్లపాటు మహేష్‌ని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్టేట్ ప్రకారం.. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‌కు రంగం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో తిరిగి సెట్స్ పైకి వెళ్లేందుకు..
మహేష్ బాబు ఓకే చెప్పినట్టు టాక్. త్వరలోనే మేకర్స్ నుంచి షూటింగ్ అప్టేట్ రానుందని అంటున్నారు. ఇక ఎస్ఎస్ఎంబీ 28ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించారు. కానీ అనుకోని కారణాలతో డిలే అవడంతో..
పోస్ట్ పోన్ అవక తప్పదంటున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి.. రాజమౌళి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు.