ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నటుడు విజయ్‌కి మరో షాక్ తగిలింది. ఇటీవల విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా మూవీ సీన్స్ లీక్ అయ్యాయి. ఈ చిత్రంలోని ఐదు నిమిషాల సీన్, ఓ పాట లీక్ అయింది. దీంతో చిత్ర బృందం, ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.