అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అట్లీ షేర్ చేసిన లయన్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు భాగాలుగా ఉన్న సింహం ముఖం, ‘నీలా ఎవరూ ఉండలేరు’ అనే క్యాప్షన్ చూస్తుంటే బన్నీ డ్యూయల్ రోల్ లేదా మల్టీ-లేయర్డ్ పాత్రలో నటిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.