NDL: బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఇవాళ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పందించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.