ప్రకాశం: రేపు పొదిలిలో జరగనున్న పొగాకు వేలం కేంద్రం ధరలపై మర్రిపూడి మండల రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మర్రిపూడి మండలంలో అధికంగా పొగాకు సాగు చేస్తుంటారు. పొగాకు సాగు ఖర్చులు బాగా పెరిగాయని రావిళ్ళవారిపాలెం మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం జరిగే వేలంకేంద్రంలో ధరలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా రేపటి కోసం ఎదురుచూస్తున్నారు.