2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ స్థానం దక్కించుకున్నారు. ఆయనతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణ్బీర్ కావడం గమనార్హం.