బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ చుట్టూ కాపీ వివాదం ముదిరింది. ఈ సినిమా కథ తనదేనంటూ కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఆరోపణలను దర్శకుడు ఆదిత్యధర్ తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన వ్యాఖ్యలతో సినిమా ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ సంతోష్‌కు ఆయన లీగల్ నోటీసులు పంపాడు.