వేతనాలపై సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం డబుల్ కాల్షీట్, 9-9 కాల్షీట్, 4 గంటలకు అదనపు కాల్షీట్ ఇవ్వాలని కోరింది. అడిగిన వేతనాలు ఇచ్చినవారికే పనిచేస్తామని.. ఇది నిరసన కాదని, కొత్త వేతనాలపై తమ నిర్ణయమని తెలిపింది. మార్చి 1 నుంచి కొత్త వేతనాలకు పనిచేస్తామని పేర్కొంది. నిర్మాతలకు అభ్యంతరం ఉంటే యూనియన్లతో మాట్లాడాలని సూచించింది.