గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలోకి మానస శర్మ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు మేకర్స్ మానసను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం దర్శకుడు బుచ్చిబాబు అదిరిపోయే స్టెప్పులు ప్లాన్ చేశాడట.