AP: చట్లసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతుగా కూటమిలోని పార్టీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే, వాల్ రైటింగ్, సిగ్నేచర్ క్యాంపులు, మిస్డ్ కాల్స్ ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రజల మద్ధతు కూడగడతామని పేర్కొన్నారు.