చికెన్ తోలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే, దీనిలో అధిక కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. చికెన్ తోలు తినడం వల్ల బరువు పెరుగుతారు. గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బ్రాయిలర్ కోడి చికెన్ తోలు అస్సలు తినొద్దు. చికెన్ స్కిన్‌లో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెపుతున్నారు.