తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమాకు బిగ్ రిలీఫ్ కలిగింది. ఏప్రిల్ 17 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి, సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ, చిత్ర యూనిట్ సాంకేతిక లోపాలను క్లియర్ చేసింది. దీంతో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో పలు చోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభంకానున్నాయి.